నమస్కారం
రామకృష్ణ
గోపాల్ భాండార్కర్ అనే మహారాష్ట్రీయుడు కూర్చిన మార్గోపదేశిక, మందిరాంతః ప్రవేశిక అనే 32+26 పాఠాలు
కల రెండు భాగాల సంస్కృతాధ్యయనం పద్ధతి ఎంతో విశిష్టమైనది, ప్రసిద్దమైనది.
భారతదేశంలో చాలా విశ్వవిద్యాలయాలలో ఇది పాఠ్యపుస్తకంగా ఉండటమే కాక విద్యార్థల
ఆదరణ, మన్నన పొందినది. సరళంగా, సుగమంగా, సోపానక్రమంలో, సాగే ఈ పాఠాలు సంస్కృతంతో మంచి
పరిచయాన్ని కలిగించి, ఆ భాషతో క్రమంగా పట్టును సాధించిపెడతాయి.
వీటిలో
పద్దతి ఏంటంటే, మొదలు ఆంగ్లార్థాలతో పదాలు ఇచ్చి, వాటితో వాక్యాలు నిర్మించి,
అనువాదం చేయిస్తారు. దాని వల్ల ఒకేసారి పదజ్ఞానం, వాక్యనిర్మాణజ్ఞానం కూడా వచ్చేసి
విద్యార్థికి వెనువెంటనే భాషను తన సొంతంగా కూర్చగలిగే శక్తి వస్తుంది. ఈపాఠాల వ్యవస్థ
కూడా చాలా క్రమంగా, ఎక్కడా నీరసం, చిరాకు కలగకుండా ఉంటుంది. పాఠాలు ఒకసారి శబ్దాలు,
ఒకసారి క్రియలు, ఒకసారి సర్వనామాలు. ఇట్ల వైవిధ్యంతో సమకూర్చబడ్డాయి. వాక్యాలు సరళ
సంస్కృతంలో, సంధినియమాలతో, సహజమైన భాష ఎట్ల ఉంటుందో అట్ల సంధులతో పొందికగా ఉంటాయి.
పెద్దగా వ్యాకరణం నియమాలు పెట్టి బెదరగొట్టకుండా పాణిని చెప్పిన విధంగా భాషావిశేషాలన్నీ
దాదాపుగా ఇమిడిపోయేవిధంగా రచయిత దీన్ని నిర్మించాడు. దాని వల్ల సంస్కృతానుభవం,
అనుభూతి విద్యార్థికి నిర్బంధం లేకుండానే కలిగిపోతాయి.
అయితే
దీనిని ఎవ్వరూ అధ్యాపకుని సహాయం లేకుండా నేర్చుకోలేరు. ఎందుకంటే పెద్దగా విషయం
గురించిన వివరణ ఎక్కడా ఉండదు. ప్రారంభికులకు స్వయంగా నేర్చుకోవటానికి ఇది
ఉపయోగపడదు. దీనిలో ఎక్కడా విపులమైన వివరణ కనపడదు. నియమాలెంతో క్లుప్తంగా, ఉండి,
ఉదాహరణలు లేకుండా ఉంటాయి. పైగా 1864 నాటి ఆ ఆంగ్లభాష ఈనాటి కాలానికి బుద్ధికి
రావటం కాస్త కష్టమే.
తెలుగుభాషద్వారా
సంస్కృతం నేర్పేవి చాలా పుస్తకాలే ఉన్నాయి కానీ ఈ పద్ధతిలో లేవు. ఇదే పాఠాల
క్రమంతో కావాల్సినంత వివరణం జోడించి, విద్యార్థులకు అందిస్తే కనుక స్వంయగా కూడా చదివి
తన అసరాలకు వినియోగించుకోగలతారనే ఉద్దేశంతో ఈ ప్రయాస చేపట్టటమైనది. చేతనైనన్ని
ఉదాహరణలు, తగినంత విషయపరిజ్ఞానం, విషయసంబద్ధమైన ఇతర వివరాలు పుష్కలంగా చేర్చటమైంది.
అభ్యాసాలు, ప్రశ్నలతో చదివినది ఎంత ఆకళింపు అయింది అనే అవబోధ కలిగించటం దీని వైశిష్ట్యం.
మీ ప్రయత్నానికి అభినoదనలు
ReplyDeleteee site oka adbhutham. . Mee sevaku seva ku sirassu vanchi paadabhivandanam chesthunnaaanu
ReplyDelete