సంస్కృతపాఠమాల 0.1
అక్షరాల పరిచయం-
సంస్కృత
అక్షరాలు-
సంస్కృతలిపిని
దేవనాగరి అంటారు.
अ, आ, इ, ई, उ, ऊ, ऋ, (ॠ, ऌ,
ॡ,) ए, ऐ, ओ , औ,
అ, ఆ, ఇ,
ఈ, ఉ, ఊ, ఋ, (ౠ, ఌ, ౡ,) ఏ, ఐ, ఓ, ఔ
ं, ः, ःक, ःप
ం, ః, ఃక, ఃప
क वर्गः - क, ख, ग, घ, ङ
కవర్గము
- క, ఖ, గ, ఘ, ఙ
च वर्गः - च, छ, ज, झ, ञ
చవర్గము-
చ, ఛ, జ, ఝ, ఞ
ट वर्गः - ट, ठ, ड, ढ, ण
టవర్గము-
ట, ఠ, డ, ఢ, ణ
त वर्गः - त, थ, द, ध, न
తవర్గము-
త, థ, ద, ధ, న
प वर्गः - प, फ, ब, भ, म
పవర్గము-
ప, ఫ, బ, భ, మ
य, र, ल, व, श, ष, स, ह,
య, ర, ల,
వ, శ, ష, స, హ
అక్షరాలు
ప్రాథమికంగా రెండు రకాలు- స్వరాలు, వ్యంజనాలు.
స్వరాలనే అచ్చులు అంటారు.అవి మొత్తం 16
అక్షరాలు. వీటికి స్వతంత్రమైన ఉచ్చారణ ఉంటుంది. అంటే వీటిని పలకటానికి ఎవ్వరి
సహాయం అవసరం లేదు. అందువలన వీటిని ప్రాణములని (ప్రాణాక్షరాలు) కూడా అంటారు. ఉచ్చారణకాలాన్ని
బట్టి అచ్చులలో రకాలు ఏర్పడినాయి. అవి ఏవో వేరేవి అని కాదు. అవే అక్షరాలైనప్పటికీ
పలకటంలో తేడా ఉంటుంది. అంతే. అవి మూడు రకాలు-
హ్రస్వం - ఒక మాత్రాకాలంపాటు అంటే
రెప్పపాటు కాలంలో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వాలంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
దీర్ఘం - రెండు మాత్రల కాలంపాటు
ఉచ్ఛరించే అచ్చులను దీర్ఘాలంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ. ఏ,ఓ లను
వక్రాలంటారు.
ప్లుతం - ఇవి ఉచ్ఛరించడానికి మూడు
మాత్రల కాలం పడుతుంది. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ. ఐ, ఔలను వక్రతమాలని కూడా అంటారు.
అ, ఇ, ఉ, ఋ లు కూడా హ్రస్వదీర్ఘాలతో పాటు ప్లుతాల రూపాలలో కూడా ఉంటాయి. ఌ
కారానికి హ్రస్వ, ప్లుతాలు మాత్రమే ఉన్నాయి. ఏ, ఓ, ఐ, ఔలకు హ్రస్వం ఉండదు.
వ్యంజనాలు స్వతంత్రంగా పలకబడలేనివి.
వీటినే హల్లులంటారు. అవి క నుండి హ వరకు 37 అక్షరములు. ఈ హల్లులను అచ్చుల సహాయము
లేనిదే పలుకలేము. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులు (ప్రాణ్యక్షరాలు) అనంటారు. అక్షరమాలలో అక్షరాల
కూర్పును దృష్టిలో పెట్టుకుని వర్గాలవారిగా వాటి విభాగాలను చూద్దాము.
అవి ఎన్నో రకాల విభాగాలు చేయబడినాయి.
మొదటి విభాగం - రెండు రకాలు-
అల్పప్రాణం – సాధారణంగా పలికేవి.
వర్గలోని 1, 3, 5 అక్షరాలు, య, ర, ల, వ
మహాప్రాణం – కొద్దిగా హకారం
జోడించి స్ఫుటంగా పలికేవి. వర్గలోని 2,4 అక్షరాలు, శ, ష, స, హ
అనుస్వారాన్ని (బిందువు, సున్నా)ను
ముక్కుతో పలుకుతారు.
రెండవ విభాగం - మూడురకాలు-
స్పర్శములు - ఇవి క నుండి మ వరకు
గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
క వర్గము
- క, ఖ, గ, ఘ, ఙ
చ వర్గము
- చ, ఛ, జ, ఝ, ఞ
ట వర్గము
- ట, ఠ, డ, ఢ, ణ
త వర్గము
- త, థ, ద, ధ, న
ప వర్గము
- ప, ఫ, బ, భ, మ
అంతస్థలు- య, ర, ల, వ - యణ్ణులు
ఊష్మలు- శ, ష,స, హ - శల్లులు
అనునాసికలు- ఙ, ఞ. ణ, న, మ
ఉభయాక్షరములు 4 అక్షరములు. సున్న, విసర్గ, ఉపధ్మానీయం, జిహ్వామూలీయం
ం – అనుస్వారం,
ః – విసర్గ
ःक – అర్ధవిసర్గ జిహ్వామూలీయః
ःप – అర్ధవిసర్గ ఉపధ్మానీయః
అనుస్వారం- అనుస్వారం అంటే మరొక
అక్షరముతో చేరి ఉచ్చరించబడేది అని అర్థం. పంక్తికి మొదట, పదానికి చివర సున్నాను వ్రాయటం తప్పు. అదే విధంగా తరువాత
అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని
వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా
ఉన్న అనుస్వారము.
సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే
సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ:
విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ
ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.
సంస్కృతపాఠమాల 0.2
ఉత్పత్తి
స్థానములు
అక్షరాలను పలికే స్థానాలను బట్టి
అక్షరాలను ఆరు విభాగాలు చేశారు. వాటిలో మిశ్రమమైనవి కూడా ఉన్నాయి.
కంఠ్యములు
: కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, ఙ, హ.
తాలవ్యములు
: దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ.
మూర్థన్యములు
: అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ర.
దంత్యములు
: దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, ల, స.
ఓష్ఠ్యములు
: పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
నాసిక్యములు
(అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ,
ఞ, ణ, న, మ.
కంఠతాలవ్యములు
: కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఏ, ఐ.
కంఠోష్ఠ్యములు
: కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఓ, ఔ.
దంత్యోష్ఠ్యములు
: దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.
ఇంతవరకు విడి అక్షరాల గురించి చెప్పుకున్నాము.
ఇక కలిపి వ్రాసే అక్షరాలను గురించి చెప్పుకుందాము. వ్యంజనాలు స్వతంత్ర ప్రతిపత్తి
లేనివి కదా. స్వరాల సహాయంతో తప్ప అవి ఉచ్చరించబడలేవు. అవి మధ్యలో ఏ స్వరాలూ
లేనప్పుడు ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోతుంటాయి. అప్పుడు అట్ల కలిసినవాటిలో
మొదటి అక్షరం సగం అయిపోతుంది. రెండవ అక్షరం దానికి ఉండే స్వరంతో పలకబడుతుంది. ఈ
కలిపి వ్రాసే అక్షరాలు మూడు రకాలు.
ద్విత్వాక్షరం- ఒక అక్షరానికి
అదే అక్షరం ఒత్తు. ఉదా- ఉత్తమం, మజ్జనం
సంయుక్తాక్షరం- ఒక అక్షరానికి
వేరొక అక్షరం ఒత్తు. ఉదా- మధ్యమం, స్వధర్మం
అనేకసంయుక్తాక్షరం- రెండుకన్నా
ఎక్కువ వేరువేరు అక్షరాలు కలవటం. ఇవి సంస్కృతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
మూర్ధ్ని (ర్-ధ్-ని) కార్త్స్నం (ర్-త్-స్-న్-యం)
ఆనుపూర్వీ- ఒక పదంగా ఏర్పడిన
అక్షరాల కూర్పును విడిగా చూపిస్తే దానిని సంస్కృతంలో ఆనుపూర్వీ అంటారు. స్వరాల
సహాయంతో పలకబడే వ్యంజనాలు ఆనుపూర్వీలో విడివిడిగా ఆయా స్వరాలకు భిన్నంగా
చూపబడతాయి. ఉదా- మధ్యమం – మ్-అ-ధ్-య్-అ-మ్-అం; ఆధ్యాత్మిక- ఆ-ధ్-య్-ఆ-త్-మ్-ఇ-క్-అ
అయ్యా, మూ'ర్థ'న్యములు కాదు మూ 'ర్ధ' న్యములు. సవరించగలరు
ReplyDeleteఅయ్యా, మూ'ర్థ'న్యములు కాదు మూ 'ర్ధ' న్యములు. సవరించగలరు
ReplyDelete