Monday, 25 April 2016

మూడవపాఠము- 1. వర్తమానకాలము, మధ్యమపురుష, ఉత్తమపురుష ద్వివచనం, బహువచనం 2. గుణ, వృద్ధి, యణ్ వర్ణాలు



మూడవపాఠము- 1. వర్తమానకాలము, మధ్యమపురుష, ఉత్తమపురుష ద్వివచనం, బహువచనం 2. గుణ, వృద్ధి, యణ్ వర్ణాలు

సంస్కృతపాఠమాల 3.1

ఇక మధ్యమ, ఉత్తమపురుషలకు మిగిలిన రెండు వచనాలు- అంటే ద్వివచచనం, బహువచనం చూద్దాం.
     మధ్యమపురుష - ‘పఠ్’ + థః,
                        ‘పఠ్’ + థ
     ఉత్తమపురుష - ‘పఠ్’ + వః,
                        ‘పఠ్’ + మః
(‘పఠ్’ ధాతువు ప్రథమగణానికి చెందింది కనుక పురుషప్రత్యయం చేర్చే ముందు ప్రథమధాతు గణ (వికరణ)ప్రత్యయం చేర్చి రూపాలు ఏర్పరచాలి.)

) मध्यमपुरुषः, उत्तमपुरुषः - द्विवचनम्, बहुवचनम् ;

वर्तमानकालः मध्यपुरुषप्रत्ययः - द्विवचनम्

पठ्-थः पठ्--थः = पठथः

वर्तमानकालः उत्तमपुरुषप्रत्ययः - द्विवचनम्

पठ्-वः पठ्--वः पठ्--वः = पठावः

वर्तमानकालः मध्यपुरुषप्रत्ययः - बहुवचनम्

पठ्- पठ्-- = पठथ

वर्तमानकालः उत्तमपुरुषप्रत्ययः - बहुवचनम्

पठ्-मः पठ्--मः पठ्--मः = पठामः

సంస్కృతపాఠమాల 3.2

ఇక మూడుపురుషల, వచనాల రూపాలను ఒకేసారి పట్టికగా చూద్దాం. ముందు ఉదాహరణకు తెలుగులో చూద్దాం. మూడుపురుషలు, రెండు వచనాలు కేవలం ప్రత్యయాలు–
                                           ఏక          బహు
     ప్రథమపురుష (అతడు/ఆమె/వారు) -తున్నాడు/ది, -తున్నారు
     మధ్యమపురుష (నీవు/మీరు) -తున్నావు, -తున్నారు
     ఉత్తమపురుష (నేను/మేము) -తున్నాను, -తున్నాము
పూర్ణరూపాలు–
                                           ఏక                బహు
     ప్రథమపురుష (అతడు/ఆమె/వారు) చదువుతున్నాడు/చదువుతున్నది, చదువుతున్నారు
     మధ్యమపురుష (నీవు /మీరు) చదువుతున్నావు, చదువుతున్నారు
     ఉత్తమపురుష (నేను/మేము) చదువుతున్నాను, చదువుతున్నాము
             

एकवचनम्
द्विवचनम्
बहुवचनम्
प्रथमपुरुषः
ति
तः
अन्ति
मध्यमपुरुषः
सि
थः
उत्तमपुरुषः
मि
वः
मः


एकवचनम्
द्विवचनम्
बहुवचनम्
प्रथमपुरुषः
पठति
पठतः
पठन्ति
मध्यमपुरुषः
पठसि
पठथः
पठथ
उत्तमपुरुषः
पठामि
पठावः
पठामः


एकवचनम्
द्विवचनम्
बहुवचनम्
प्रथमपुरुषः
वसति
वसतः
वसन्ति
मध्यमपुरुषः
वससि
वसथः
वसथ
उत्तमपुरुषः
वसामि
वसावः
वसामः

అభ్యాసం–
     పై విధానం ప్రకారం ఈ క్రింది ధాతువులకు ప్రత్యయాలను జోడించి, మూడు పురుషలలో మూడు వచనాలలో క్రియాపదాలను చేయండి. ప్రతీ పదానికి తెలుగులో అర్థం నోటితో చెప్పండి–
वस् వస్ (=నివసించుట, ఉండుట), निन्द् నింద్ (=నిందించుట), व्रज् వ్రజ్ (=వెళ్ళు), धाव् ధావ్ (=పరుగెత్తుట), वद् వద్ (=మాట్లాడుట), पत् పత్ (=కిందపడుట), अर्ज् అర్జ్ (=ఆర్జించుట, సంపాదించుట), गर्व् (=గర్వించుట), वृष् (वर्ष्) వర్ష్ (=వర్షించుట), चर् చర్ (=చరించు)

సంస్కృతపాఠమాల 3.3

గుణ-వృద్ధి-యణ్-వర్ణాః

మన అక్షరమాలలో వర్ణాలు ఒకటికొకటి సంబంధం కనిపిస్తున్నా దగ్గరగా గమనిస్తే వాటిలో కొన్నింటికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. కొన్ని వ్యాకరణ ప్రక్రియా సందర్భాలలో పదాలలోని ప్రాథమిక వర్ణాలలో తేడా వచ్చి అవి రూపం మారుతాయి. వాటిలో గుణవర్ణాలను చూద్దాం. శాస్త్రీయనిర్వచనం ప్రకారం ‘అ,, ఓ’ అనేవి గుణవర్ణాలు లేదా గుణాలు. ‘ఇ’ స్థానంలో ‘ఏ’ రావటం, ‘ఉ’ స్థానంలో ‘ఓ’ రావటం, ‘ఋ’ స్థానంలో ‘అర్’ రావటం గుణం. ఉదాహరణకు- వేదాలున్నాయి కదా. వేద శబ్దం ఏ ధాతువు నుంచి వచ్చింది? ‘విద్’ నుండి. ‘విద్’ లో ఇ కి గుణం వస్తుంది. ‘వేద’ అవుతుంది.
     (అ – అ)
     అ+ఇ – ఏ
     అ+ఉ – ఓ
     అ+ఉ – అర్
ధాతువులు రెండు రకాలు కదా- అజంతాలు, హలంతాలు. వాటిలో అజంతాలలో అంతంలో ఉన్న అచ్చుకు గుణం వస్తుంది. అంటే అక్కడ ‘ఇ’ ఉంటే ‘ఏ’ అవుతుంది. ‘ఉ’ ఉంటే ‘ఓ’ అవుతుందన్నమాట. మనం రూపం మారేవిగా చూసిన మొదటి రకం ధాతువులలో చెప్పాలంటే జరుగుతున్న మార్పు ఇదే. మరోసారి ఇక్కడ గమనించండి-
     जि (जय्) (జయించుట) - जि > जे > जय्  > जयति
(ఇది ‘జే’ నుంచి ‘జయతి’ అయిన తీరు తరువాత చూద్దాము.) అట్లాగే-
     नी > ने > नय् > नयति (=తీసుకుపోవుట)
     भू > भो > भव् > भवति (=ఉండుట, అవ్వుట)
     सृ > सर् > सरति (=జరుగుట, కదులుట, ముందుకు పోవుట)
హలంతాలలో చివరనుంచి ఒక అక్షరం ముందు ఉన్న అచ్చుకు (=‘ఉపధ’లో అచ్చుకు) గుణం వస్తుంది. హలంతధాతువులలో ఉపధ మారటం ఈ విధంగా ఉంటుంది-
      बुध् > बोध् > बोधति (=తెలుసుకొనుట, బోధపడుట)
      क्षुभ् > क्षोभ् > क्षोभति (=క్షోభించుట, బాధపడుట)
      चित् > चेत् > चेतति (=అర్థంచేసుకొనుట, గమనించుట, స్పృహవచ్చుట)
అట్లాగే ఇప్పుడు వృద్ధులు చూద్దాము. వృద్ధవర్ణాలు మూడు. ఆ, ఐ, ఔ. ఉదా- సీతకు వైదేహి అని పేరు. ఎట్లవచ్చింది? ఆమె విదేహ రాజు నందన కనుక. విదేహకు చెందినది > వైదేహి. ఇక్కడ ‘వి’ (వ్+ఇ) లోని ‘ఇ’కి ‘ఐ’ వచ్చింది. అట్లగై సుందర భావం అనే దానికి సౌందర్యం అనే పదం ఉంది కదా. అది ఎట్లా వచ్చింది? సుందర లోని ‘సు’ (స్+ఉ) లో ‘ఉ’ కి ‘ఐ’ వచ్చి, అంటే వృద్ధి వచ్చి సౌందర్య అయింది.
మరి యణ్ణులంటే ఏంటి? య, ర, ల, వ లను యణ్ణులంటారు. (ఎందుకు అంటారో వ్యాకరణ పాఠాలలో చూద్దాం.) సంధిప్రక్రియలలో మనకు ‘ఇ’ స్థానంలో ‘య’ రావటం, ‘ఉ’ స్థానంలో ‘వ’ రావటం కనిపిస్తుంది. ఉదాహరణకు- అత్యుత్తమం లో అతి+ఉత్తమం అని ఉండగా- ‘తి’ (త్+ఇ) లోని ‘ఇ’స్థానంలో ‘య’ వచ్చి అత్య్-ఉత్తమం = అత్యుత్తమం అవుతుంది. (వివరాలు మందు ముందు పాఠాలలో చూద్దాం.) అట్ల దేని స్థానంలో ఏ అక్షరం వస్తుందో ఒక పట్టికలో ఉంచటమైనది. చూడండి.
प्राथमिकः
गुणः
वृद्धिः
यणः
-
अर्
आर्

అభ్యాసం
పై ధాతువులకు ప్రథమైకవచనం రూపాలు ఏర్పరచండి.
1.    మధ్యమోత్తమ పురుషలకు ‘లస్’ ధాతువుకు అన్ని వచనాల రూపాలు చెప్పండి.
2.    గుణవర్ణాలు అంటే ఏమిటి? అవి ఎన్ని? ఏవి?
3.    గుణం ఎక్కడ వస్తుంది?
4.    ఉపధ అంటే ఏమిటి?

7 comments:

  1. ఇంత మంచిగా తెలుగు ద్వారా సంస్కృతం నేర్పిస్తున్న బ్లాగు నిర్వాహకులకు .చాలా ధన్యవాదాలు

    ReplyDelete
  2. నేను తి.తి.దే.వారి సంస్కృతం నేర్చుకుందాం ద్వారా అభ్యాసం ప్రారంభించాను.అందులో ద్వివచనం ఇప్పటవరకు(10పాఠాలు) రాలేదు. ఆ వేటలో మీ పాఠమాల చూసాను. చక్కగా వివరించారు. ధన్యోస్మి.

    ReplyDelete
  3. చాలా చక్కగా వివరించారు. సులభంగా సంస్కృతం నేర్చు కోవాలంటే ఈ పాఠాలను అనుసరిస్తే చాలు. ధన్యవాదములు

    ReplyDelete
  4. chala baga cheputhunna paatalanu enduku nilipivesaru ?
    dayachesi marala post cheyyandi. dhanyavadalu

    ReplyDelete